calender_icon.png 22 August, 2025 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల అభివృద్ధి కోసమే సంక్షేమ పథకాలు

22-08-2025 12:00:00 AM

కల్యాణ లక్ష్మిచెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పాయల్

ఆదిలాబాద్, ఆగస్టు ౨౧ (విజయక్రాం తి): ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన కుటుంబానికి ఆర్థిక భారం నుండి కాస్త ఉపశమనం కలిగించేందుకు ఒక లక్ష నగదు ఎంతో కొంత దోహదపడుతోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జైనథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గురు వారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైనద్, బేల, సాత్నాల మండలాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితగతిన చెక్కులు అందే లా అధికారులు సహకరించాలని కోరారు. పేదవారు ఆడపిల్లల పెళ్లిల్లు చేసేందుకు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించడం జరుగుతుందన్నారు.  అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నా రు. కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.