12-01-2026 05:57:49 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ విజయక్రాంతి జాతీయ దినపత్రిక నూతన ఆంగ్ల సంవత్సరం 2026 క్యాలెండర్ను నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... ప్రజలకు సకాలంలో నిజమైన సమాచారాన్ని అందించడంలో మీడియా కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
ముఖ్యంగా విజయక్రాంతి వంటి దినపత్రికలు ప్రజా సమస్యలను వెలుగులోనికి తీసుకువచ్చి పాఠకులకు తెలియజేయడంలో ముందుంటున్నాయన్నారు. నూతన సంవత్సరంలో పత్రిక మరింత విశ్వాసనియతతో, ప్రజాపక్షంగా వార్తలు అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అలాగే సమాజంలో శాంతిభద్రత అవగాహన పెంచడంలో మీడియా, అధికారుల సమన్వయం అవసరమని తెలిపారు.