12-01-2026 05:54:56 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలో నీ ప్రజా ప్రభుత్వం విద్యా,వైద్యానికి అధిక ప్రాధాన్యత నిస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు. మండల పరిధిలోని అన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనం, ఆరోగ్య ఉప కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం, పిల్లలకు మెరుగైన విద్యా వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
అంగన్వాడి భవనంతో చిన్నారులకు సురక్షిత వాతావరణంలో పోషణ, విద్య అందుతుందని, ఆరోగ్య ఉప కేంద్రం ద్వారా గ్రామస్థులకు దగ్గర్లోనే వైద్య సేవలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, ఎంపీడీవో శేష్ కుమార్, డిఎంఅండ్ హెచ్ ఓ వెంకటరమణ, డాక్టర్ లింగమూర్తి, సిడిపిఓ శ్రీజ, జై పంచాయతీ రాజ్ డిఈ లింగా నాయక్, తదితరులు పాల్గొన్నారు.