12-01-2026 06:17:48 PM
డివిజన్ ప్రెస్ క్లబ్ భవన్ సభ్యులకు హామీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాంతి): మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ భవన్ కు స్థలం, నిధులు మంజూరు చేయిస్తానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. సోమవారం మంథనిలో పర్యటిస్తున్న మంత్రిని మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోతుకూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొడారి మల్లేష్ యాదవ్, మండల కన్వీనర్ మహావది సతీష్ కుమార్, సహాయ కార్యదర్శి మాదర బోయిన కిషన్ యాదవ్, సీనియర్ పాత్రికేయుడు మాటేటి కుమార్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన మంత్రి మంథని ఆర్డీఓ సురేష్ ను పిలిచి మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ భవన్ కు స్థలం కేటాయించవలసిందిగా ఆదేశించారు.