12-01-2026 06:01:28 PM
జయంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ మంత్రి
వనపర్తి,(విజయక్రాంతి): పిన్న వయస్సులో తన సందేశాల ద్వారా స్పూర్తి నింపిన మహనీయుడు వివేకానందుడు అని ఆయన ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం మని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. వివేకానందుని జయంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రం లోని వివేకానంద చౌరస్తా లో గల వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఆయన ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాజిమంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... భారత దేశంలో సంస్కృతి, సాంప్రదాయాలను యువత అనుసరించాల్సిన మార్గాలను ఉపదేశించి చైతన్యం చేశారని పిన్న వయసులో మరణించిన వారి చరిత్ర సూర్యచంద్రులు ఉన్నంతవరకు నిలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమం లో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, పలుసశంకర్ గౌడ్, నాగన్న యాదవ్,చిట్యాల రాము, నందిమల్ల సుబ్బు, శంకర్, తదితరులు ఉన్నారు.