calender_icon.png 21 May, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేషన్ ఏర్పాటుతో పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధికి బాటలు

13-04-2025 09:07:46 PM

పేదలు, కష్ట జీవులు, కార్మికుల పార్టీ సిపిఐ

సిపిఐ శత వసంతోత్సవాలు పార్టీ విస్తరణకు దోహదపడాలి: సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం

పాల్వంచ ప్రాంత సమగ్రాభివృద్ధిపై ఎమ్మెల్యే కూనంనేని ప్రత్యేక శ్రద్ద

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటుతో పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధికి బాటలు పడ్డాయినీ సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం అన్నారు. శనివారం రాత్రి పట్టణ పరిధిలోని సీతారామపట్నం, గొల్లగూడెం సీపీఐ శాఖ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలగా పాల్వంచ మున్సిపాలిటీకు ఎన్నికలు జరగకపోవడంతో ప్రత్యేక అధికారుల పరిపాలన కొనసాగుతుంది, ఈ నేపథ్యంలోనే స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పట్టు పట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేయించారని, రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలినీ కోరారు. పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురులేదని, నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సిపిఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు.

స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు నియోజకవర్గని అన్ని విధాల అభివృద్ధి చేయటానికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్, ఏఐటీయూసీ నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, మడుపు ఉపేంద్ర చారి, వైఎస్ గిరి, వర్క్ అజిత్, ఎల్లబోయిన నరసయ్య, లింగం సత్యనారాయణ, అల్లి పున్నయ్య,  తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీతారామపట్నం సిపిఐ నూతన శాఖ కార్యదర్శిగా తంతనపల్లి వెంకన్న, సహాయ కార్యదర్శిగా లక్ష్మీనారాయణ తో పాటు 15 మందితో, గొల్లగూడెం సిపిఐ నూతన శాఖ కార్యదర్శిగా ఎల్లబోయిన రామకృష్ణ, సహాయ కార్యదర్శిగా చింతల రామకృష్ణ, బండారి భాస్కర్ 19 మందితో నూతన శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.