13-04-2025 09:23:25 PM
పుల్లూరి సింహాద్రి పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు
మునగాల: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాస్ పథకానికి అప్లై చేసుకునేందుకు దరఖాస్తు తేదీని ఈ నెల చివరివరకు పొడిగించాలని, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం( పి.డి.ఎస్.యు) జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ... శని, ఆది, సోమవారాలు సెలవులు కావడం సైట్ ఓపెన్ కాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని,అప్లై చేసిన దరఖాస్తులు సైతం సెలవు కావడంతో సమర్పిచలేకపోయారన్నారు. అనేక రోజులుగా కులం ఆదాయ సర్టిఫికెట్ కొరకు సెలవులు కారణంగా ఈ పథకానికి అప్లై చేసుకోవడం కష్టంగా ఉన్నది అన్నారు.దాని కోసం ఎదురు చూస్తున్న సైట్ మొరాయించటం సర్వర్ బిజీ వల్ల అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ప్రభుత్వం పునరఆలోచన చేసి తేదిని పొడిగించాలన్నారు.ఏవైనా సర్టిఫికెట్ లేకపోయినా తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇచ్చి అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు. రెవెన్యూ అధికారుల సైతం కుల ఆదాయ సర్టిఫికెట్ లని త్వరగా దరఖాస్తుదారులకు అందించాలన్నారు.