జయశంకర్ జయంతి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్(విజయక్రాంతి):తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, విద్యావేత్త ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతిని( Jayashankar birth anniversary) గురువారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Lakshmi) ప్రొ. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు ప్రొ. జయశంకర్ అని కొనియాడారు. "నీళ్లు, నిధులు, నియామకాలు" అనే నినాదంతో ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను వివరించారు. యువత ప్రొ. జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ హైమద్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, కౌన్సిలర్ చిలువేరి వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు మరుసుకోల సరస్వతి, నిస్సార్, సాంగ్డే జీవన్, సాయి శ్రవణ్, వినీష్, శైలేష్ తదితరులు పాల్గొన్నారు.






