పదవీ త్యాగంతో తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టింది
ఏ రంగంలోనైనా జయశంకర్ కు అద్భుత అవగాహన
హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి(Professor Jayashankar Jayanti) సందర్భంగా తెలంగాణ భవన్‌లోని ఆయన విగ్రహానికి పూల మాల వేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఘన నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.... ఏ రంగంలో నైనా జయశంకర్ కు అద్భుత అవగాహన ఉండేదని కేటీఆర్ పేర్కొన్నారు. అవగాహన పెంచుకుని ఇతరులకు పంచే ప్రయత్నం చేసేదన్నారు. జయశంకర్ ను ఏ విషయం అడిగినా ఓపికగా సమాధానం ఇచ్చేవారని తెలిపారు.
తెలంగాణలో వెనుకబడిన, దగాపడ్డ జిల్లా మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ లో ఉద్యమం పతాకస్థాయిలో ఉండాలి కదా? అని అడిగా అన్నారు. మహబూబ్ నగర్ లో ఆరుచోట్ల పోటీ చేస్తే ఒకటే గెలిచామని అడిగానని చెప్పారు. స్వయం సమృద్ధి, ఆత్మగౌరవం, స్వయం పాలన గురించి వివరించారని తెలిపారు. కరీంనగర్, వరంగల్ జిల్లాలకు గోదావరి జలాల వల్ల స్వయం సమృద్ధి సాధించారని చెప్పారని వెల్లడించారు. మహబూబ్ నగర్ స్వయం సమృద్ధి కోసం పోరాటం చేస్తోందని సూచించినట్లు కేటీఆర్ తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఏటా 14 లక్షల మంది వలస వెళ్తారన్నారు. ఇప్పటికిప్పుడే ఆత్మగౌరవం అజెండా ఎత్తుకోవాలంటే సాధ్యం కాదని చెప్పారన్నారు. అర్థవంతంగా.. అవగాహనతో అర్థమయ్యేలా చెప్పడం గొల్ల కళ అన్నారు. జయశంకర్ కు మించి అంత గొప్పగా చెప్పేవాళ్లు మరొకరు లేరని కేటీఆర్ కొనియాడారు. పదవీ త్యాగంతో తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిందన్న కేటీఆర్ పదవులకు రాజీనామా చేసి కేసీఆర్ ఉపఎన్నికను అనివార్యం చేశారని గుర్తు చేశారు. ఉప ఎన్నికను ఆహ్వానించి ప్రజాశక్తిని దేశానికి కేసీఆర్ చూపారని స్పష్టం చేశారు. 2006, 2008 లో వరస రాజీనామాల పర్వం కొనసాగిందని కేటీఆర్ పేర్కొన్నారు.






