22-12-2025 06:59:20 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించగా అందులో భాగంగా తుంగతుర్తి మండలంలోని మొత్తం 24 గ్రామ పంచాయతీల సర్పంచులు, అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టారు.
తుంగతుర్తిలో సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, అన్నారం కుంచాల శ్రీనివాస్ రెడ్డి, సంగం సర్పంచ్ కలకోట్ల మల్లేష్ కరివిరాల సర్పంచ్ మోర సంధ్య కొత్తగూడెం సర్పంచ్ రమేష్ గానుబండ సర్పంచ్ వెంకటమ్మ, తూర్పు గూడెం దాసరి ఎల్లమ్మ వెంపటి తప్పట్ల ఎల్లయ్య గొట్టిపర్తి మంజుల రామన్నగూడెం రాజశేఖర్ నాయక్ దేవుని గుట్ట తండా గుగులోతు స్వాతి భాస్కర్, వెలుగు పెళ్లి అశ్విని కన్నా రెడ్డి బండ రామారం కొరికొప్పుల నరేష్ గౌడ్,
సూర్యతండ లకవాత్ బహుభయూ, గుడితండ గుగులత్ ఝాన్సీ మంచ్యతండలాకవత్ రాందాస్, బాపనీభవితండ సపావత్ బికోజి యనకుంటతండబాగ్యమ్మ, కాశితండ జటోత్ పులమ్మ రావులపల్లి జ్యోతి సింగరంతండ గుగులొథ్ సుధాకర్, రవులపల్లి చింతకుంట్లా మనోజ్, కేశవాపురం మిర్యాల శ్రీనివాస్, మానపురం భాగ్యమ్మలు ఆయా గ్రామపంచాయతీలో మండల అధికారుల పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారం చేపట్టడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.