14 June, 2026 | 1:42 AM

అక్రమ అబార్షన్ కేంద్రంపై పోలీసుల దాడి

14-06-2026 12:00 AM

ఇద్దరు అరెస్ట్.. న్యాయమూర్తి ముందు హాజరు

నాగోల్, జూన్ 13 (విజయక్రాంతి): నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపురి కాలనీలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో అక్రమంగా అబార్షన్లు చేస్తున్న వ్యవహారం పోలీసుల డెకాయ్ ఆపరేషన్లో వెలుగులోకి వచ్చింది. మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఎలాంటి వైద్య అర్హతలు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే కేంద్రాన్ని నిర్వహిస్తున్న ట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం, జైపురి కాలనీ రోడ్ నెంబర్ -2లో ‘కేసరి ఫస్ట్ ఎయిడ్ సెంటర్‘ పేరుతో కేంద్రాన్ని నిర్వహిస్తూ గర్భిణీ మహిళలకు అక్రమంగా అబార్షన్లు చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్వోటీ ఎల్బీనగర్ బృందం, నాగోల్ పోలీసులు సంయుక్తం గా డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ద ర్యాప్తులో భాగంగా గర్భిణీ మహిళగా మ హిళా కానిస్టేబుల్ను పంపగా, అక్కడ ఉన్న వీర రేవతి అనే మహిళ ఎలాంటి వైద్య అర్హతలు లేకపోయినా అబార్షన్ చేయడానికి అంగీకరించినట్లు పోలీసులు గుర్తించారు.

అబార్షన్ కోసం రూ.10 వేల నగదు తీసుకుని ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమ వుతుండగా పోలీసులు దాడి చేసి అక్రమ కార్యకలాపాలను బట్టబయలు చేశారు. దాడిలో భాగంగా కేంద్రం నుంచి వైద్య సా మగ్రి, మందులు, రికార్డులు మరియు ఇత ర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కేంద్ర నిర్వాహకురాలు బండారు వెంకట లక్ష్మితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అక్రమ వైద్య సేవలు అందించడం, అనుమతులు లేకుండా గర్భస్రావాలు నిర్వహించడం తదితర ఆరోపణలపై కేసు నమోదు చేసి ఇద్ద రు నిందితులను న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు నాగోల్ ఇన్స్పెక్టర్ మక్బు ల్ జానీ తెలిపారు. ప్రజలు కేవలం ప్రభుత్వ అనుమతులు పొందిన ఆసుపత్రులు, అర్హత కలిగిన వైద్యులను మాత్రమే సంప్రదించాలని ఆయన సూచించారు.