28-09-2025 08:07:09 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే మన్ కీ బాత్ 126వ కార్యక్రమాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వీక్షించారు. ప్రధాని మోదీ దేశ అభ్యున్నతికి, దేశ అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు తదితర అంశాలను మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో పంచుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంనాథ్, సత్యనారాయణ గౌడ్, ముత్యం రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, సాదం అరవింద్, నవీన్, నరేందర్, జమాల్, సత్యం చంద్రకాంత్ ఉన్నారు.