18 April, 2026 | 3:55 PM

Breaking News

మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •   దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి   •  

త్రివేణి సంగమంలో ఎమ్మెల్యే మదన్‌మెహన్ పుష్కర స్నానం

27-05-2025 12:37 AM

ఎల్లారెడ్డి, మే 26 (విజయ క్రాంతి) : త్రివేణి సంగమంలో పుష్కర స్నానం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సోమవారం తన అనుచరులతో కలిసి స్నానాలను ఆచరించారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి నది పుష్కర మహోత్సవాలలో  ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో భారీగా పుష్కర స్నానం సహచరించడానికి తరలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించారు.

అనంతరం,శ్రీ ముక్తీశ్వర స్వామిని & అమ్మవారు ని  దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్  మాట్లాడుతూ, పుష్కరాల సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం అరుదైన అదృష్టం. ఎల్లారెడ్డి ప్రజలు, రైతులు,పాడి పంటలతో  అష్ట ఐశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఆరోగ్యాంగా ఉండాలని కోరుకున్నారు.

ప్రజలందరూ శాంతిగా, భక్తిశ్రద్ధలతో పుష్కర ఉత్సవాలను జరుపుకోవాలని కోరుతున్నాను అని తెలిపారు.ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన మంత్రి శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 8 మండలాలు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుర్ర నారా గౌడ్, సంగారెడ్డి, తూర్పు రాజులు, సాయిబాబా తదితర నాయకులు  పాల్గొన్నారు.