calender_icon.png 29 May, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేయర్స్ శిక్షణలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి

27-05-2025 12:39:57 AM

కలెక్టర్ ఆశిష్ సంగువాన్ 

కామారెడ్డి, మే 26 (విజయ క్రాంతి): లైసెన్సు సర్వేయర్స్ శిక్షణలో ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలని, శిక్షణ అనంతరం ప్రభుత్వ పరంగా విధులు నిర్వహించవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం  ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో రెండు నెలల పాటు శిక్షణ కార్యక్రమాన్ని  కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లైసెన్సు సర్వేయర్లకు రెండు నెలల పాటు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న శిక్షణలో ప్రతీ అంశాన్ని శిక్షకుల నుండి తెలుసుకోవాలని, శిక్షణ తరువాత ప్రభుత్వ పరంగా విధులు బాధ్యతతో నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. మొదటి విడతలో 131 మందికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు పదిరోజు, ప్రతీ రోజు ఉదయం   పూట తరగతి గదిలో థియరీ, మధ్యాహ్నం పూట ప్రాక్టికల్ నేర్చుకోవలసి ఉంటుందని తెలిపారు.

భూ భారతి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న పట్టాదారుని యొక్క భూములకు సంబంధించిన కొలతలు, మ్యాప్ లు ప్రభుత్వ పరంగా తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. శిక్షణ అనంతరం పరీక్షను నిర్వహిస్తారని తెలిపారు. శిక్షకులు అన్ని అంశాలను బోధించాలని తెలిపారు.

అంతకు ముందు అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ మాట్లాడుతూ, నిజాం కాలంలో భూముల కొలతలు కోలవడం జరిగాయని, మళ్ళీ 1989-90 సంవత్సరంలో భూముల హక్కులను అప్ డేట్ చేయడం జరిగిందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం లైసెన్స్ సర్వేయర్ లను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. శిక్షణ పొందిన తర్వాత ప్రభుత్వ పరంగా బాధ్యతతో విధులు నిర్వర్తించవలసి ఉంటుందని తెలిపారు.

దీని వలన రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. అనంతరం శిక్షణ మెటీరియల్ శిక్షణ సర్వేయర్ లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భూ కొలతల సహాయ సంచాలకులు శ్రీనివాస్, డిప్యూటీ సర్వేయర్స్, తదితరులు పాల్గొన్నారు.