calender_icon.png 23 November, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవోపేతంగా పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

10-02-2025 12:45:23 AM

  • స్వామి వారి స్వర్ణ విమాన గోపురం 
  • మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం 
  • బ్రహ్మోత్సవాలను చూసి తరిస్తున్న భక్తులు

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి) : శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ స్వామి పాత గుట్ట ఆలయంలో జరుగుతున్న స్వామివారి తిరుకళ్యాణ వార్షిక బ్రహ్మోత్స వాలు రంగ రంగ వైభవంగా కనుల పండుగగా జరుగుతున్నాయి. ఆగమ శాస్త్ర సాంప్రదాయ బద్ధంగా స్వస్తి వాచనంతో వేద పండితులు వృత్తికులు పారాయను కులు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు వందలాది మంది భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను కనులారా వీక్షిస్తూ తరిస్తున్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో మూడవ రోజు అయిన ఆదివారం నాడు నిత్యారాదనం పారాయణుకులచే వేద పారాయణాలు. మూల మంత్ర అనుష్టానములు గావించారు. ఆలయ గోపరాన్ని స్వామివారి ప్రధాన దేవాలయాన్ని బంగారు తాపడంతో అలంకరించారు. మహా కుంభాభిషేక సంప్రోక్ష మహోత్సవాన్ని ప్రారంభించారు.

స్వామివారిని అమ్మవారిని అలంకరించి సింహ వాహన సేవలో ఊరేగింపు వేడుకను ఆలయ ప్రధాన అర్చకులు ఉప ప్రధాన అర్చకులు యజ్ఞాచార్యులు వేద పండితులు నిర్వహించారు. అశ్వవాహన దారుడై స్వామి వారు అమ్మవారు. భక్తులకు దర్శనమి చ్చారు. శ్రీ స్వామివారి అమ్మవారి ఎదుర్కోలు మహోత్సవం సందర్భంగా అశ్వ వాహనదారులను గావించి మేళ తాళాల మధ్య ప్రధాన అర్చకులు  వేడుకలను వైభవంగా నిర్వహించారు.

సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా వీర ప్రతాప్ భజన భక్త మండలి, భాగ్యలక్ష్మీ భజన మండలి వారిచే భజన కార్యక్రమాలు. శ్రీదేవి భక్తి సంగీత కార్యక్రమాలు. స్నేహ నృత్యాలయ బృందం కూచిపూడి నృత్య కార్యక్రమాలను నిర్వహించారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త  నరసింహ మూర్తి, కార్యనిర్వాహణాధికారి భాస్కర రావు, ఉప కార్య నిర్వహణ అధికారి, సహాయ కార్యనిర్వాహన అధికారులు. ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు