15 April, 2026 | 12:06 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి

07-06-2025 12:24 AM

మేడ్చల్, జూన్ 6 (విజయ క్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గంలో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. మచ్చ బొల్లారం డివిజన్ కు చెందిన స్వప్న రెడ్డికి 8500, నరేందర్ కు 60000, సక్సేనాకు 25000, అల్వాల్ డివిజన్ కు చెందిన మల్లేష్, అనిత , వెంకటాపూర్ డివిజన్ కు చెందిన విగ్నేశ్వర కు 60000 చొప్పున మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

వీరు అనారోగ్యానికి గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. సీఎంఆర్‌ఎఫ్ కింద నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి సిఫారసు చేయగా నిధులు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, బీ ఆర్ ఎస్ నాయకులు అనిల్, కిషోర్ గౌడ్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్ పవన్, ప్రశాంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జావిద్ తదితరులు పాల్గొన్నారు.