04-02-2026 12:05:05 AM
శ్రీరంగాపురం ఫిబ్రవరి 3:మండల కేంద్రంలో సోమవారం జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన ఎదుట్ల శ్రీను కుటుంబాన్ని ఎమ్మెల్యే మెగా రెడ్డి పరామర్శించారు. వనపర్తి ఏరియా హాస్పిటల్ మార్చురీకి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ఈ కష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ, ఎదుట్ల శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.
బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున అందే పరిహారం త్వరగా అందేలా అధికారులతో మాట్లాడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మద్దిలేటి, మాజీ జెడ్పిటిసి రాజేంద్ర ప్రసాద్ , ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.