calender_icon.png 4 November, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్ఎస్ఎస్ కవాతు ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ

04-11-2025 07:40:52 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ఆర్ఎస్ఎస్ పథ సంచలన్ కవాతు ర్యాలీలో బిజెపి నేతలు పాల్గొన్నారు. అదిలాబాద్ ఎంపీ జి నాగేష్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బిజెపి జిల్లా నాయకులు సత్యనారాయణ గౌడ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో కలిసి ప్రత్యేక డ్రెస్ వేసుకొని ర్యాలీలో పాల్గొన్నారు. మంచిర్యాల చౌరస్తా నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు కాలినడకన ర్యాలీలో పాల్గొన్నారు.