31-01-2026 12:17:53 AM
హుజూరాబాద్, జనవరి 30 (విజయ క్రాంతి): వీణవంక మండల కేంద్రంలో మినీ మేడారంగా పిలుచుకొని సమ్మక్క సారలక్క జాతరకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. గ్రామ సర్పంచ్ దాసరపు సరోజన రాజేంద్రప్రసాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌ శిక్ రెడ్డి మాట్లాడుతూ పోరాట పటిమకు స్ఫూర్తిగా నిలిచిన సమ్మక్క సారలక్క తల్లులను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరుపున అన్ని చర్యలు తీసుకున్నామని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకున్న గ్రామ సర్పంచ్ , పాలకవర్గాన్ని అభినందించారు. ఆయన వెంట మాజీ సర్పంచులు నీల కుమార్, సత్యనారాయణ, బండారి ముత్తయ్య, మాజీ ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి, వైసీపీ మాజీ లతా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.