calender_icon.png 31 January, 2026 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధునిక యాంత్రీకరణ పద్ధతిలో వ్యవసాయం చేయాలి

31-01-2026 12:17:29 AM

తాడ్వాయి,జనవరి, 30( విజయ క్రాంతి): ఆధునిక యాంత్రీకరణ పద్ధతిలో వ్యవసాయం సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం రైతులకు రాయితీపై వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు పాత పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఇబ్బందులు పడకుండా, ఆధునిక పద్ధతులు ఉపయోగించుకోవాలన్నారు.

ప్రభుత్వం రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు అందిస్తుందని, ఈ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు ఆర్గానిక్ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు. రసాయనిక ఎరువులు తక్కువగా వాడుకొని పంటలు పండించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.. ఈ సందర్భంగా రైతులకు రోటవేటర్లు 12, విత్తన సాగు యంత్రాలు 16, పెట్రోల్ పంపులు 2, కల్టివేటర్ 1 రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో తాడువాయి ఏవో నరసింహులు, ఏఈవోలు రమ్య, అశోక్, రైతులు పాల్గొన్నారు.