సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మావతి
10-04-2026 12:00 AM
కోదాడ, ఏప్రిల్ 9 :కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో కోదాడ నియోజకవర్గ పరిధిలోని 444 మంది లబ్దిదారులకు రూ 1.38 కోట్ల విలువ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గురువారం లబ్దిదారులకు అందజేశారు.
అక్కడికి వచ్చిన వారిని సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వంగవేటి రామారావు, మునిసిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ బాబు, వైస్ చైర్మన్ డి మల్లేశ్వరి, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.




