22 June, 2026 | 3:01 AM

నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మావతి విస్తృత పర్యటన

22-06-2026 12:00 AM

రైతు కూలీలను వివరాలడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

కోదాడ(అనంతగిరి), జాన్ 21: నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మావతి ఆదివారం విస్తృతంగా పర్యటించారు. మునగాలలో మార్గమధ్యంలో వ్యవసాయ కూలీలతో ముచ్చటించి, సమస్యలడిగి తెలుసుకున్నారు. మునగాల మండలం నర్సింహులగూడెంలో గంగమ్మ, కాటమయ్య వేడుకల్లో పాల్గొన్రు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం సోలార్ వీధి దీపాలను ప్రారంభించారు. నడిగూడెం మండలం, శ్రీరంగాపురంలో ఆంజనేయస్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతగిరి మండలం పాలారం తండలో గ్రామపంచాయతీ భవనం, అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతగిరి మండలం, శాంతినగర్ లో పల్లె దావఖానా నూతన భవనాన్ని ప్రారంభించారు. బొజ్జగూడెంతండలో అంగన్వవాడీ భవనాన్ని ప్రారంభించారు. కొత్తగూడెంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బజ్జూరి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బుర్రా పుల్లారెడ్డి, బాబు నాయక్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.