calender_icon.png 2 October, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తహసిల్దార్

01-10-2025 10:14:56 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో తులసి వన మహోత్సవం ఏర్పాటు తహసీల్దార్ రామ్మోహన్, ఆలయ కమిటీ అధ్యక్షుడు తంగిడిపల్లి మహేష్ నాటారు. ఆలయ ప్రాంగణంలో తులసి మొక్కలు నాటారు. తులసి మొక్కలు నాటడం అభినందనీయమని భక్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి తులసిమాల అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో పూజకు ఉపయోగపడే ప్రతి ఒక్క నాటేందుకు కమిటీ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగ్గా గౌడ్, మాజీ ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీ వర్ధన్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.