calender_icon.png 2 October, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాతో సరసం తప్ప పర్మినెంటు ఏదీ కాదు!

01-10-2025 10:21:34 PM

హీరో నాగశౌర్య నుంచి రాబోతున్న పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. రామ్ దేశినా (రమేశ్) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై  శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య సరసన విధి హీరోయిన్‌గా నటిస్తుండగా సముద్రఖని, నరేశ్ వీకే, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘అమెరికా నుండి వచ్చాను’ పాటను విడుదల చేశారు. హారిస్ జయరాజ్ స్వరపర్చిన ఈ గీతానికి చంద్రబోస్ సాహిత్యం అందించగా, చందన బాలకళ్యాణ్, గోల్డ్ దేవరాజ్ ఆలపించారు. ‘అమెరికా నుండి వచ్చాను.. ఇక అస్సలు సత్యం సెబుతాను.. అందరి కోసం వచ్చాను.. నా అనుభవ సారం సెబుతాను.. పర్మినెంటు కాదు.. ఏదీ పర్మినెంటు కాదు.. ఆ సొగసు వయసు తెలివైనా.. మన పైసా పదవి గెలుపైనా.. అరె కోసం ద్వేషం అహమైనా.. నాతో సరసం తప్ప పర్మినెంటు ఏదీ కాదు కాదు కాదు..’ అంటూ సాగుతోంది. అటు సంగీత ప్రియులను రంజింపజేస్తూ.. ఇటు సాహితీప్రియులను ఆలోచింపజేస్తోందీ గీతం. ఈ చిత్రానికి డీవోపీ: రసూల్ ఎల్లోర్; సంగీతం: హారిస్ జైరాజ్; లిరిక్స్: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్; ఫైట్స్-: సుప్రీమ్ సుందర్, పృథ్వీ; ఆర్ట్: రామాంజనేయులు; ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు.