calender_icon.png 2 October, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రకాళి శరన్నవరాత్రోత్సవాల ముగింపుకు కేసీఆర్ కు ఆహ్వానం

01-10-2025 10:11:50 PM

హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారి దేవస్థానంలో జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా, అమ్మవారి ప్రసాదాన్ని, అమ్మవారి వద్ద ఉంచిన పట్టువస్త్రాలను అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి దాస్యం వినయ్ భాస్కర్ దసరా శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వాదం తీసుకున్నారు.