01-10-2025 10:09:22 PM
చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామ శివారులో కారు ఢీకొన్న ఘటనలో మేకల రమేష్, శివలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతసాగర్ శివారులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న నీరు, ఇబ్రహీంపూర్ వైపు నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.