01-10-2025 09:56:35 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేసిన పోలీస్ స్టేషన్ ను గురువారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వ కార్యాలయాల భవనాలను పరిశీలించినప్పటికీ, అనువుగా లభించకపోవడంతో మండల కేంద్రంలోని ఒకరి గృహంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయ తలపెట్టిన భవనానికి బుధవారం రాత్రి రంగులు వేయించారు.