calender_icon.png 2 October, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అరి’ వచ్చేది అప్పుడే

01-10-2025 10:27:27 PM

వినోద్‌వర్మ, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ వంగ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆర్‌వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డీ శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మిస్తున్నారు. విజయదశమి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెల 10న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. అరిషడ్వర్గాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో సుమన్, ఆమని, శుభలేక సుధాకర్, వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి, చమ్మక్ చంద్ర, జెమినీ సురేశ్, ఐడ్రీమ్ అంజలి, మనిక చిక్కాల తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: అనుప్ రూబెన్స్; సాహిత్యం: కాసర్ల శ్యామ్, వనమాలి, కళ్యాణ్ చక్రవర్తి; సినిమాటోగ్రఫీ: కృష్ణప్రసాద్, శివశంకర వరప్రసాద్; ఎడిటర్: జీ అవినాష్; ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నాయర్.