01-10-2025 09:58:54 PM
తొలి సీఐగా సత్యనారాయణ
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో కొత్తగా పోలీస్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కేసముద్రం పోలీస్ సర్కిల్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లికుదురు, కేసముద్రం పోలీస్ స్టేషన్లతో పాటు నూతనంగా ఏర్పాటు కానున్న ఇనుగుర్తి పోలీస్ స్టేషన్ లను కేసముద్రం సర్కిల్ పరిధిలోకి చేర్చారు. ఈ క్రమంలో కేసముద్రం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఎస్ ఐ క్వార్టర్ లో సీఐ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు సర్కిల్ కార్యాలయానికి అవసరమైన ఫర్నిచర్, ఆఫీస్ గది ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. దసరా రోజు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
కేసముద్రం తొలి సీఐగా సత్యనారాయణ
నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రస్తుతం డీ.సీ.ఆర్.బిలో సీఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణను నియమించినట్లు పోలీస్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు తొలి సీఐగా సత్యనారాయణ గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు.