27-09-2025 08:38:24 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ గ్రామంలో రూ 4.70 కోట్లు వ్యయంతో నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటిసీ)ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువతకు ఈ ఏటీసీ సెంటర్ ఒక గొప్ప అవకాశంగా మారాలని ఆకాంక్షించారు. యువత ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌లో శిక్షణ పొంది, ప్రపంచంలోనే అత్యాధునిక మిషనరీ సాంకేతిక పరిజ్ఞానంలో ముందుండాలని ఆయన ఉద్ఘాటించారు. ఈ కేంద్రం ద్వారా శిక్షణ పొందిన యువత ఉన్నత నైపుణ్యాలతో ప్రపంచ వేదికపై పోటీపడగలరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ ధర్మచారి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు కైపు శ్రీనివాసరెడ్డి, పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, భజన సతీష్, చల్లా వెంకట నారాయణ, ఇంగువ రమేష్ తదితరులు పాల్గొన్నారు.