22-05-2025 04:29:05 PM
మహబూబాబాద్/ములుగు (విజయక్రాంతి): విద్య మాత్రమే జీవితాల్లో వెలుగులను తెస్తుందని, జీవితమంతా దళితుల అభివృద్ధికి కృషిచేసిన భాగ్యరెడ్డి వర్మ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh), ములుగు ఎస్పీ డాక్టర్ శబరిష్(SP Dr. Shabarish) అన్నారు. దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందిన సంఘసంస్కర్త ఆదిఆంధ్ర సభ స్థాపకుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి ఈ సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కె. వీరబ్రహ్మచారి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి నరసింహస్వామి, ములుగు డిపిఓ సూపరిండెంట్ శ్రీనివాస్, ఆర్ ఐ లు స్వామి, సంతోష్, వెంకటనారాయణ, ఎస్ఐ జగదీష్, ఆర్ ఎస్ ఐ సంపత్ రావు పాల్గొన్నారు.