25 May, 2026 | 11:47 AM

ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

17-06-2024 12:25 AM

రాజేంద్రనగర్, జూన్ 16 (విజయ క్రాంతి): మెదక్ పట్టణంలో గోవుల తరలింపు విషయమై శనివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. రెండు వర్గాలు పరస్పరం దాడు చేసుకోగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఓ వర్గం వారిని పరామర్శించేందుకు ఆదివారం ఉదయం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బయల్దేరారు. ఎమ్మెల్యే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్నారని తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.