1 April, 2026 | 2:36 AM

ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

01-04-2026 12:05 AM

కొల్చారం, మార్చి 31 : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం బకాయిలు వెంటనే విడుదల చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం  కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిన దానయ్య యశోద, పాపయ్య బుజ్జమ్మ లకు చెందిన ఇందిరమ్మ ఇండ్లను స్థానిక సర్పంచ్ దొడ్లే ఆంజనేయులు తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.ఆరు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఆమె నెరవేర్చడం లేదు అన్నారు. ఇండ్ల బిల్లుల చెల్లింపులో కూడా జాప్యం జరుగుతుందన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఆరు లక్షల రూపాయలు చెల్లించడంతోపాటు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం  లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. చిన్న గ్రామమైన తుక్కాపూర్ను మోడల్ గ్రామంగా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్, మాజీ జెడ్పిటిసి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రవితేజ రెడ్డి, సర్పంచులు స్వర్ణలత విజయ్, కాంతమ్మ ప్రభాకర్, మోహన్, మాజీ సర్పంచులు యాదయ్య,మురళి గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు వేమారెడ్డి రంగంపేట ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, యువజన విభాగం జిల్లా నాయకులు సురేష్ గౌడ్, సుధాకర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.