calender_icon.png 13 September, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెనుకబడిన జుక్కల్ అభివృద్ధి కి ప్రాధాన్యం

13-09-2025 07:43:01 PM

టీపిసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు 

బిచ్కుంద, సెప్టెంబర్ 13 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రద్ధను కేంద్రీ కరించిందని జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు అన్నారు.శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర టీపిసీసీ అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జుక్కల్  ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు  నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్,NRI భుజంగారి భాస్కర్ రెడ్డి కలిసి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి అంశాలపై విశదంగా చర్చించారు.

మౌలిక వసతులు – రోడ్ల అభివృద్ధి, గ్రామాలకు రహదారి కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాల మెరుగుదల.

విద్యా రంగం – ప్రభుత్వ పాఠశాలల్లో భవనాల నిర్మాణం, ఆధునిక సదుపాయాలు, విద్యార్థుల కోసం హాస్టల్ వసతులు.

ఆరోగ్య సేవలు –మండల కేంద్రాలలో 24 గంటల వైద్య సదుపాయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విస్తరణ.. వ్యవసాయం,సాగు నీరు, కాలువల విస్తరణ, చెరువుల పునరుద్ధరణ, రైతులకు తగిన సబ్సిడీలు.

ఉపాధి అవకాశాలు, యువతకు ట్రైనింగ్ సెంటర్లు, చిన్నపాటి పరిశ్రమల అభివృద్ధి.

నాయకుల అభిప్రాయాలు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం మేము నిరంతరం కృషి చేస్తున్నా మన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా కఠినంగా పనిచేస్తాం" అన్నారు.

నిజాం సాగర్ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

"కాంగ్రెస్ పార్టీ గ్రామ సభలలో ప్రజల సమస్యలను విన్నాం. వాటిని నేరుగా రాష్ట్ర నాయకత్వానికి తీసుకెళ్తున్నాం. ప్రజలకు కావాల్సింది మాటలు కాదు, అమలు. అదే దిశగా ఈ సమావేశం సాగింది" అని పేర్కొన్నారు.

NRI భుజంగారి భాస్కర్ రెడ్డి

మా స్వస్థలం జుక్కల్ అభివృద్ధి చెందాలని ప్రతి NRI ఆశిస్తోంది. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు, యువతకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కావాలి. మా వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం" అన్నారు.

టీపిసీసీ అధ్యక్షుడి హామీ సమావేశానికి స్పందించిన మహేష్ కుమార్ గౌడ్

"కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుంది. జుక్కల్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా మిగలకుండా, సమగ్ర అభివృద్ధి జరగాలనే దిశగా చర్యలు తీసుకుంటాం. మౌలిక వసతులు, రైతు సంక్షేమం, యువత ఉపాధి, ఆరోగ్య సదుపాయాల పెంపు—ప్రతి అంశానికి ప్రాధాన్యం ఇస్తాం" అని హామీ ఇచ్చారు.