13-09-2025 07:45:09 PM
క్షేమంగా బయటకు తీసిన సిబ్బంది
అదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని లిఫ్ట్ లో ఓ వృద్ధురాలు, పేషేంట్స్ ఇరుక్కున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. ఆస్పత్రికి వచ్చిన ఓ వృద్ధురాలు పై అంత ఎత్తుకు వెళ్లి కిందికి దిగే క్రమంలో లిఫ్ట్ సడెన్ గా ఆగిపోయింది. దీంతో ఆందోళన చెందినా వృద్ధురాలు, పేషేంట్స్ లిఫ్టులో ఉన్న వారి సహకారంతో సెక్యూరిటీ గార్డు సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికులు, సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది వారిని క్షేమంగా బయట చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.