17-11-2025 08:18:11 PM
చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోనీ ఉరుమడ్ల రోడ్డులో జిల్లా నాయకుడు పాటి నర్సిరెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన సాంబశివ రైస్ ఇండస్ట్రీని నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం సోమవారం ప్రారంభించారు. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే ఉద్యోగ అవకాశాలు, పరిసర ప్రాంత అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా పాటి నర్సిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, నాయకులు పందిరి శ్రీనివాస్, నర్రా మోహన్ రెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, జడల చిన్న మల్లయ్య, తెరటిపల్లి హనుమంతు, జిట్టా నగేష్, ఏర్పుల పరమేష్, పొన్నం లక్ష్మయ్య, పాటి నాని తదితరులు పాల్గొన్నారు.