ఘనంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జన్మదినం
షాద్‌నగర్, మార్చి 15 (విజయక్రాంతి): షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జన్మదిన వేడుకలు ఆదివారం నియోజకవర్గవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా జన్మదిన అభినందనలు తెలిపారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఫోన్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం నుంచే ఎమ్మెల్యే నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్లు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి శంకర్ గారికి అభినందనలు తెలిపారు.అభిమానులు, కార్యకర్తలు పలుచోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో ఉండాలని నియోజకవర్గంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. గ్రామాలు, పట్టణ కాలనీల్లో కార్యకర్తలు కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ప్రజల ఆదరాభిమానాల మధ్య ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.




