16 March, 2026 | 2:43 AM

జూనియర్ యోగిగా సీఎం రేవంత్

16-03-2026 01:11 AM
  1. నగరంలో బుల్డోజర్ పాలన కొనసాగుతోంది

మాజీ మంత్రి హరీశ్‌రావు

రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

ఎమ్మెల్యే ముఠా గోపాల్

భోలక్ పూర్‌లో ముస్లింలకు నిత్యవసర సరుకుల పంపిణీ

ముషీరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): ఉత్తరప్రదేశ్‌లో పేద ప్రజల ఇండ్లను కూల్చిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి మా దిరిగా సీఎం రేవంత్ రెడ్డి నగరంలో పేదల నివసించే ఇళ్లను కూల్చివేస్తూ జూనియర్ యోగి లాగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. నగరంలో బుల్డోజర్ పాలన కొనసాగుతున్నదని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం భోలక్ పూర్ డివిజన్‌లోని అంజుమన్ భవన్‌లో మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని 2500 మందికి నిత్యవసర సరుకుల కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన టి. హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు కావస్తున్నా నగరంలో పేదలకు ఏ ఒక్క పక్క గృహం నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు. పవిత్ర రంజాన్ మాసంలో అమెరికా ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలలో జరుగుతున్న యుద్ధం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలందరికీ మళ్లీ మంచి రోజులు రావాలని హరీష్ రావు కోరారు.

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్సీ సలీం నగరంలో పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో పదివేల మందికి నిత్యవ సర సరుకుల కిట్లను అందజేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ రంజాన్ పండుగను ప్రజలంతా ఐక్యంగా జరుపుకొని మతసామర స్యాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమం లో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసిం హ, పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల హరిబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.