16 March, 2026 | 2:43 AM

విజయవంతమైన వైద్య శిబిరం

16-03-2026 01:09 AM

120 మందికి వైద్య సేవలు అందించిన సిబ్బంది

రాజేంద్రనగర్ మార్చి 15 (విజయ క్రాంతి) : రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ పద్మశ్రీ హిల్స్ కాలనీ లో ఆదివారం నిర్వహించిన వైద్య శిబిరం విజయవంతమైంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు పద్మశ్రీ హిల్స్ పార్కులో రైనా తెర్కోర్ డయాగ్నస్టిక్ క్లినిక్ మరియు పద్మ శ్రీ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా హెల్త్ క్యాంపు నిర్వహించారు.

దాదాపు 120 మంది పాల్గొని ఈ వైద్య శిబిరం లో చికిత్సలు చేయించుకున్నారు. బ్లడ్‌టెస్ట్‌లను మరియు థైరాయిడ్ పరీక్షలను చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరం లో రెనా క్లినిక్ డాక్టర్ ఏం. ర్ ఎలిజబెత్, అభిషిక్త్. కె మరియు పద్మశ్రీ హిల్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులు అమరేందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి మరియు థైరోకేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.