calender_icon.png 15 August, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే వినోద్

15-08-2025 03:12:24 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ 2 గ్రౌండ్ లో శుక్రవారం మురళి క్రికెట్ అకాడమీ(cricket competitions) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న క్రికెట్ పోటీలను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(Bellampally MLA Gaddam Vinod) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రీడాకారుల ఉద్దేశించి మాట్లాడారు. యువత క్రీడల వైపు మళ్ళితే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందన్నారు. క్రీడా స్ఫూర్తితో ఆడి మరింతగా రాణించాలని సూచించారు. ఎం ఎం సి సి క్రికెట్ అకాడమీ, వి ఎస్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ టీంలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఎమ్మెల్యే వినోద్ వెంట టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, కాసిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు రత్నం ప్రదీప్, నాయకులు దావ రమేష్, శ్యామ్ తదితరులు ఉన్నారు.