calender_icon.png 14 October, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని, ముత్తారంలో ఇసుక మాఫియా గాళ్ళకు చెక్

13-10-2025 09:56:04 PM

ఇసుక అక్రమంగా తరలిస్తున్న మంథనిలో 2, ఖమ్మంపల్లిలో 2 ట్రాక్టర్లు పట్టివేత..

మంథని (విజయక్రాంతి): మంథని, ముత్తారంలో ఇసుక మాఫియా గాళ్ళకు పోలీసులు చెక్ పెడుతున్నారు. మంథని మండలంలో సోమవారం ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా గోపాల్ పూర్ మానేరు వాగు నుండి, ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి మానేరు నది నుండి దొంగతనంగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుండగా, నాలుగు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసినట్లు మంథని ఎస్ఐ డేగ రమేష్ తెలిపారు.

మంథని మండలంలోని వేల్పుల అశోక్ అక్కేపెళ్లి, అక్కపాక శశికుమార్, గోపాల్పూర్, రాచర్ల నాగరాజు, మంథని చెందినవారని, ముత్తారం మండల్ ఖమ్మం పల్లి గ్రామానికి చెందిన పర్ష ఓదెలు, పాన్నాల సురేష్ యాదవ్ యాదవ్, కటకం సదయ్య, ఖమ్మంపల్లిలపై కేసు నమోదు చేశామని, మానేరు నది నుంచి అక్రమంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను దొంగతనంగా అక్రమంగా రవాణా చేసినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.