13-08-2025 12:00:00 AM
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి.. కోతల రెడ్డిగా మారారని, మంత్రిగా ఆయనతో రాష్ట్రానికి పైసా ప్రయోజనం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) పనులకు సంవత్సరం క్రితం టెండర్లు పిలిచారని, నెల రోజుల్లోనే పనులు మొదలవుతాయని ప్రకటించి.. ఇప్పటివరకు పనులెందుకు ప్రారంభించలేదని మంత్రిని ప్రశ్నించారు.
ఇక దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) పనులైతే ఒక్క అడుగైనా ముందుకు పడలేదని నిలదీశారు. వట్టి మాటలు కట్టిపెట్టి ప్రజలు మేలు చేయాలని హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రాన్ని 50 సంవత్సరాల పాలించిన కాంగ్రెస్.. కేవలం 2,511 కి.మీ మేర మాత్ర మే కేంద్రం నుంచి అనమతులు తెచ్చి నేషనల్ హైవేస్ నిర్మించిందని, తెలంగాణ వచ్చి న తర్వాత కేవలం పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్ర భుత్వం 2,472 కి.మీ మేర హైవేస్ నిర్మించిందని స్పష్టం చేశారు.