calender_icon.png 17 November, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

17-11-2025 12:00:00 AM

గోపాలపేట నవంబర్16:  మృతి చెందిన భావిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి పరామర్శించారు. ఏదుల మండలం చీర్కపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త మాజీ సర్పంచ్  తల్లి నారమ్మ మృతి చెందడంతో విషయం తెలుసుకున్న  శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

నారమ్మ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 95 సంవత్సరాల వయసు గల నారమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో  బాధపడుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వెంట రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలు, యూత్ ప్రెసిడెంట్ మల్లేష్, సురేష్ గౌడ్,  రాంచందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.