17-11-2025 12:00:00 AM
చిన్న చింతకుంట, నవంబర్ 16: మండల పరిధిలోని అమ్మాపురం గ్రామంలోని ప్రసిద్ధ కురుమూర్తి స్వామి ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ పూజారులు మాజీ ఎమ్మెల్యేకు ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గ బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.