calender_icon.png 17 November, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదాలను అరికట్టడమే ప్రధాన లక్ష్యం

17-11-2025 12:00:00 AM

అలంపూర్, నవంబర్ 16: రోజు రోజుకి జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే ప్రధాన లక్ష్యమని బీఆర్‌ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు మహేష్ నాయుడు అన్నారు.అలంపూర్ మండల పరిధిలోని లింగన్నవాయి గ్రామం నుండి ఇమాంపురం వరకు ఉన్న బీటీ రోడ్డు కు ఇరువైపులా ముళ్ళ లను ఆదివారం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో తన సొంత ఖర్చులతో జెసిబి ద్వారా ముళ్ళ పొదలను తొలగించడం  జరిగింది.

ఈ సందర్భంగా మహేష్ నాయుడు మాట్లాడుతూ.. రోడ్డుకిరువైపులా ముళ్ళపొదలు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రయాణికులు, గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులే కాక, రోజు రోజు కు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామీణ అభివృద్ధికై పాటుపడుతున్న మహేష్ నాయుడుకు గ్రామీణ ప్రజలు, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, మల్లికార్జున, చైతన్య యాదవ్, ఎల్‌ఐసి మద్దిలేటి, బాలరాజు, జగన్, మరియు పంచాయతీ సిబ్బంది రఘు తదితరులు పాల్గొన్నారు.