17-11-2025 12:00:00 AM
-వాస్కులర్, డయాబెటిక్ ఫుట్ కేర్‌పై అవగాహన
-100 హార్లే-డేవిడ్సన్ బైకులతో ర్యాలీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 16 (విజయక్రాంతి): వరల్డ్ డయాబెటిస్ డే సం దర్భంగా రెనోవా సెంచరీ హాస్పిటల్స్, హార్లే-డేవిడ్సన్ బంజారా చాప్టర్, తెలంగాణ, సం యుక్త ఆధ్వర్యంలో కేర్ ఫర్ యువర్ లెగ్స్ పేరుతో ప్రత్యేక అవగాహన బైక్ ర్యాలీని బం జారాహిల్స్‌లో నిర్వహించారు. వాస్కులర్, డయాబెటిక్ ఫుట్ కేర్ ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో ప్రజలు, ఫిట్నెస్ ఔత్సాహికులు, మాసబ్ ట్యాంక్ పోలీసులు సహా వందలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. రెనోవా సెంచరీ హాస్పిటల్స్, బంజా రా హిల్స్ నుంచి ప్రారంభమై ఖాజాగూడ రోడ్డు వరకు కొనసాగిన ఈ బైక్ ర్యాలీని క్లినికల్ డైరెక్టర్ న్యూరోసర్జరీ, న్యూరోమోడ్యు లేషన్, డా. సయ్యద్ అమీర్ బాషా పాస్పాల, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, సీవోవో, రవీంద్రనాథ్ గరగ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డా.ప్రీతి శర్మ, హెచ్ వోడీ, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్, ఎండోవాస్కులర్ సర్జన్, రెనోవా సెంచరీ హాస్పిటల్స్ మాట్లాడుతూ.. ‘డయాబెటిక్ పాద సమస్యల వల్ల జరిగే ఐదేళ్ల మరణాలు, ప్రత్యక్ష ఖర్చు క్యాన్సర్తో పోల్చదగినవని తెలిపారు. ప్రస్తుతం మనం అవగాహన రైడ్ చేస్తున్న ఈ సమయంలో, ప్రపంచంలో ఎక్క డో ఒకచోట ఒకరు కాలును కోల్పోతున్నారు. ప్రతి 20 సెకన్లకూ డయాబెటిస్ కార ణంగా ఒక లోవర్ లింబ్ ఆమ్పుటేషన్ జరుగుతోంది.. ఈ మహమ్మారిని ఎదుర్కొనేం దుకు నివారణ, ముందస్తు రోగ నిర్ధారణ ఉత్తమ మార్గాలు’ అన్నారు.
రెనోవా సెంచరీ హాస్పిటల్స్‌లో ప్రత్యేకమైన మల్టీ-డిసిప్లినరీ డయాబెటిక్ ఫుట్ క్లినిక్ను ఏర్పాటు చేసి, మధుమేహ పాద సమస్యల చికిత్సకు సమ గ్ర సంరక్షణ అందిస్తున్నామని డా.ప్రీతి శర్మ తెలిపారు. కార్యక్రమంలో డా. సయ్యద్ అమీ ర్ బాషా పాస్పాల, క్లినికల్ డైరెక్టర్ న్యూరోసర్జరీ, న్యూరోమోడ్యులేషన్, డా. కె. కృష్ణ ప్రభాకర్, డైరెక్టర్, ఇంటర్నల్ మెడిసిన్, రవీంద్రనాథ్ గరగ, సీవోవో, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డా. వారిస్, సెంటర్ హెడ్, డా. షరీఫ్, వైస్ ప్రెసిడెంట్, మెడికల్ సర్వీసెస్, సహా పలువురు వైద్యులు, నర్సింగ్, సిబ్బం ది, హార్లే-డేవి డ్సన్ బంజారా చాప్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు.