12-05-2025 12:00:00 AM
గజ్వేల్, మే11 : గజ్వేల్ పట్టణంలో ఆదివారం డాగ్స్ తో పోలీసులు మత్తు పదా ర్థాల కోసం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, హ నుమాన్ టెంపుల్ రోడ్, శివారు ప్రాంతం లో డాగ్స్ తో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యం రాజు మాట్లాడుతూ అనుమానాస్పద ప్రదేశాలలో డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గు రించి తనిఖీలు నిర్వహించామన్నారు.
గంజా యి ఇతర మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్స్ ఎవరైనా కలిగి ఉన్నా, అక్రమంగా రవాణా చేసినా, పాన్ ఇతర షాపులలో అమ్మినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పిల్లలు మత్తుపదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు దృష్టి సా రించాలన్నారు.
మత్తు పదార్థాల వినియో గం విక్రయాల గురించి తెలిసినవారు 100 కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీలలో గజ్వేల్ ఎస్‌ఐ ఉమా రెడ్డి, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.