calender_icon.png 7 July, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు

07-07-2025 01:40:31 AM

జగిత్యాల అర్బన్, జూలై 6 (విజయక్రాంతి): జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఆది వారం జిల్లా కేంద్రం లో ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కం డేయాలయం, విద్యానగర్ రామాలయంలో ఎమ్మెల్యే సంజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్, రోటరీక్లబ్ సహకారంతో ఎమ్మెల్యే జన్మదినం సందర్భం గా రక్తదాన శిబిరం నిర్వహించారు.

జగిత్యాల శ్రీ వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు నోట్ బుక్కు లు పంపిణీ చేయగా, వృద్ధాశ్రమంలో బెడ్ షీట్లు పంపిణీ చేశారు. ధర్మపురి రోడ్డులోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగిత్యాల ప్రతి వార్డులో, గ్రామాల్లో కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరిపారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, శరత్ రావు, శ్రీలత రామ్మోహన్ రావు, బద్దం లత జగన్, పిట్ట ధర్మరాజు, విఘ్నేష్ తదితరులుపాల్గొన్నారు.