07-07-2025 01:41:32 AM
కరీంనగర్ క్రైం, జూలై 6 (విజయ క్రాంతి): నగరంలోని ఆరేపల్లి మెయిన్ రోడ్డులో మసీద్ వద్ద నుండి ఎస్డీఎఫ్ నిధులు 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టే డ్రైనేజీ పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రె డ్డి మాట్లాడుతూ శివారు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పనులు చేపడుతున్నామని గత పాలకులు శివారు ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని అన్నారు.
నగరం విస్తరించడం వల్ల ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాల్సిన అవసరముందని ఆదిశగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా ప్రణాళిక తయారు చేశామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురుమల్ల శ్రీనివాస్, ఎట్టపు వేణు, తిరుపతి రెడ్డి, వెంకటరెడ్డి, బుర్ర గౌరయ్య, బత్తిని అనిల్, శ్రీకాంత్, అనిఖిత్, రాజయ్య, బాలమల్లు తదితరులుపాల్గొన్నారు.