31-12-2025 01:39:29 AM
కోదాడ, డిసెంబర్ 30: కోదాడ నియోజకవర్గంలో జనవరి 4వ తేదీన జరిగే ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా జాగృతి నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్లో మాట్లాడుతూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనవరి 4న గ్రామగ్రామానికీ వెళ్లి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటారని తెలిపారు. సమస్యలపై జాగ్తృతి పక్షాన ఉద్యమిస్తామన్నారు. కవిత పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు భూక్య సంజు నాయక్, తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా ఇన్చార్జి కందుల మధు, జితేందర్, గోపి, నరసింహ,నరేందర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.